విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పుడు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ తో ఓ సినిమా చేస్తున్నాడు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ కథ ముందుగా సుధీర్‌బాబు దగ్గరకు వెళ్లింది. సుధీర్ కూడా ఓకే చెప్పాడు. అయితే సుధీర్ ఈ నిర్మాతలకు ఓ కండీషన్ పెట్టాడు. తన దగ్గర మరో కథ ఉందని, దాన్ని కూడా పట్టాలెక్కిస్తానంటే – రెండు సినిమాలకు ఎగ్రిమెంట్ కుదుర్చుకుందామని షరతు విధించాడు. దానికి రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఓకే చెప్పింది. తీరా చూస్తే.. సుధీర్ వినిపించిన కథకి భారీ బడ్జెట్ అవసరమైంది. ఆ బడ్జెట్లో సినిమా తీస్తే.. ఎంత హిట్టయినా నష్టాలు భరించక తప్పదు. దాంతో `నీతో రెండు సినిమాలు చేయలేం..` అని రిజ్వాన్ చెప్పేసింది. ఆ వెంటనే సుధీర్ కూడా `ఈ సినిమా చేయను` అని తప్పుకున్నాడు. ఆ తరవాత ఈ కథ శ్రీవిష్ణు దగ్గరకు వెళ్లింది. విష్ణకి ఈ కథ బాగా నచ్చినా.. ప్రస్తుతం ఉన్న బిజీ వల్ల ఎస్ చెప్పలేకపోయాడని సమాచారం. ఆ తరవాతే… ఈ సినిమా కల్యాణ్ దేవ్ దగ్గరకు వెళ్లిందట. ఈ సినిమాలో సుధీర్ బాబుని హీరో అనుకన్నప్పుడు.. మెహరీన్‌ని కథానాయికగా ఎంచుకున్నారు. సుధీర్ బాబు తప్పుకోవడంతో మెహరీన్ కూడా చిత్రబృందానికి హ్యాండిచ్చింది. సుధీర్ బాబు చెప్పడం వల్లే.. మెహరీన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నదని ఇన్సైడ్ వర్గాల టాక్.