చిరంజీవి 150వ సినిమాకి సంబంధించి…. ఈ రెండు మూడేళ్లలో ఎన్ని వార్తలో! ఓ సినిమా గురించి అభిమానులు, సినీ పరిశ్రమ ఇంతలా మాట్లాడుకోవడం అరుదైన విషయమే. ఇప్పుడు చిరు సినిమాకి సంబంధించే మరో.. ఫ్లాష్ లాంటి వార్త ఇది. చిరంజీవి తన 150వ సినిమాగా కత్తిని రీమేక్ చేయాలనుకొన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా స్ర్కిప్టుని పక్కన పెట్టినట్టు టాక్. కత్తి స్ర్కిప్టునే తెలుగులో తర్జుమా చేస్తున్న వినాయక్… దానికి సమాంతరంగా మరో రెండు కథల్ని కూడా తయారు చేశాడట. కత్తి కంటే.. వినాయక్ వినిపించిన కొత్త కథలే చిరంజీవికి బాగా నచ్చాయట. అందుకే.. కత్తిని పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టు టాక్. ఇప్పుడు వినాయక్ తన సొంత కథపై కసరత్తులు మొదలెట్టాడట.
చిరంజీవికి ముందు నుంచీ కత్తి రీమేక్ పై కొన్ని అనుమానాలున్నాయి. అవి రోజు రోజుకీ బలపడుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సెకండాప్ చిరు అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వినాయక్ పలు మార్పులు చేశాడు.కానీ.. చిరుకి అవేం సంతృప్తిగా అనిపించలేదు. ఇష్టం లేని కథని బలవంతంగా రుద్దడం ఎందుకు అని చిరుకి కొత్త కథ వినిపించాడు వినాయక్. అదికాస్త వర్కవుట్ అయ్యేలా ఉంది. 150వ సినిమా మొదలయ్యేలోగా ఇంకెన్ని ట్విస్టులు ఎదురవుతాయో??