చాలా కాలం క్రితం… వెలిగొండ శ్రీనివాస్ అనే రచయిత ఓ కథ రాసుకొన్నాడు. అందులో ఓ నాన్న తన కొడుక్కి పెళ్లి చేయాలనుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాలని చూస్తుంటాడు. దాదాపుగా ‘మా నాన్నకి పెళ్లి’ లాంటి కథే ఇది. అప్పట్లో ఆయన అనుకొన్న హీరోలు నాగబాబు, తరుణ్. తండ్రి నాగబాబు అయితే, కొడుకు తరుణ్ అన్నమాట. కథ కూడా ఓకే అయిపోయి, పట్టాలెక్కే తరుణంలో సినిమా ఆగిపోయింది.
ఇన్నాళ్లకు ఇలాంటి కథే ఒకటి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన `మా నాన్నకు పెళ్లి` టైపు కథ… చిరంజీవికి బాగా నచ్చింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ కథ మొదలవ్వనుంది. చిరంజీవి హీరో. ఆయన తనయుడిగా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు. చిరంజీవి పక్కన త్రిషనీ, సిద్దూ పక్కన శ్రీలీలని హీరోయిన్లుగా ఎంచుకొన్నారు. ఆగస్టులో ఈ సినిమా మొదలు కానుంది. అప్పట్లో నాగబాబు కోసం అనుకొన్న పాయింట్ ఇదే కావొచ్చు. కానీ… ట్రీట్మెంట్ మాత్రం చిరు స్థాయికీ, ఆయన ఇమేజ్‌కీ తగ్గట్టుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లెద్దు. అయితే.. వెలిగొండ శ్రీనివాస్ రాసుకొన్న కథకీ, ఇప్పుడు ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథకూ ఏమైనా లింకు ఉందా అనేదే డౌటు. దీనికి ఆ ఇద్దరు రచయితలే సమాధానం చెప్పగలరు.