స్ట్రాటజిస్టుల మధ్య కూడా రాజకీయం తరహాలో యుద్ధం జరుగుతోంది. ఆ ఫలితం జంపింగుల దాకా వచ్చింది. ఇప్పటి వరకూ రాజకీయ నేతలు పార్టీలుమారుతారని వింటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా స్ట్రాటజిస్టులు కూడా మారుతున్నారు. వైసీపీకి ఐప్యాక్ తరపున రుషిరాజ్ లీడ్ చేస్తున్నారు. ఆయన పేరుకే ఉంటారు కానీ ఆలోచనలు మొత్తం శంతను సింగ్ అనే మరో డైరక్టరవని చెబుతూంటారు. ఏమయిందో ఏమో కానీ..హఠాత్తుగా ఈ శంతను సింగ్ ఐ ప్యాక్ కు రిజైన్ చేసి.. టీడీపీకి స్ట్రాటజిస్టుగా సేవలు అందిస్తున్న రాబిన్ శర్మ కంపెనీ షోటైమ్ కన్సల్టింగ్ లో చేరిపోయాడు.
శంతను సింగ్ వ్యవహారం ఇప్పుడు రెండు రాజకీయ పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి . ‘ఐప్యాక్’ పొలిటికల్ వింగ్ ను చూశారు. 2019 ఎన్నికల సమయంలోను ఆయన వైసీపీ కోసం పనిచేశారు. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలను తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్ కు ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో పరిస్థితి ఏమీ బాగోలేదని సర్వేలు రిపోర్టులు అప్పుడప్పుడూ బయటకు వస్తున్నాయి.
అక్కడ ఉంటే మొత్తానికే మోసం వస్తుందనుకున్నారో..రుషిరాజ్ తో విబేధాలో కానీ.. శంతన్ సింగ్ బయటకు రావడం ఐ ప్యాక్ టీము షేక్ కు గురి చేస్తోంది. తమ స్ట్రాటజీలు అన్నీ ఇక టీడీపీకి తెలిసినట్లేనని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఐ ప్యాక్ కు కావాల్సినంత ఆర్థిక దన్ను ఉంది కాబట్టి..రాబిన్ శర్మ టీం నుంచి కీలక వ్యక్తుల్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా స్ట్రాటజిస్టుల మధ్య కూడా రాజకీయం చురుకుగా సాగుతోంది.