రెండో విడత రుణమాఫీ కోసం తెలంగాణ అసెంబ్లీ ఆవరణను వేదికగా సర్కార్ ఎంచుకోవడం వెనక వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. డెడ్ లైన్ విధించుకొని మరీ రుణమాఫీ చేస్తున్నా బీఆర్ఎస్ మాత్రం కారు కూతలు ఆపడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి కొనసాగిస్తోన్నా బీఆర్ఎస్ ఏదో ఒక అంశాన్ని పట్టుకొని రేవంత్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు గట్టిగా బుద్ది చెప్పేందుకు అసెంబ్లీ ఆవరణనే వేదికగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇతర వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తే సర్కార్ కార్యక్రమమే అయినా అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా చూస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది పూర్తిగా ప్రభుత్వ ప్రొగ్రాంలా ఉండటంతోపాటు.. బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలకు అక్కడి నుంచే ధీటుగా బదులిచ్చే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : పాపం బీఆర్ఎస్ నేతలు!
అసెంబ్లీ ఆవరణలో నిర్వహిస్తోన్న రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఒకవేళ ఈ కార్యక్రమానికి వెళ్ళకపోతే ప్రభుత్వ పెద్దల నుంచి బీఆర్ఎస్ పై ఎదురుదాడి జరగడం ఖాయం. ప్రభుత్వ ఆహ్వానం మన్నించి వెళ్తే ఇన్నిరోజులు చేసిన విమర్శలకు అర్థం లేకుండా పోతోంది. దీంతో బీఆర్ఎస్ నేతల నోరు మూయించేందుకే .. రుణమాఫీ రెండో విడత కార్యకమాన్ని అసెంబ్లీ ఆవరణలో చేపట్టాలని కాంగ్రెస్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.