ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం బస్సు యాత్ర సందర్భంగా అక్రమ కార్యక్రమాలు చేపట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆ స్టూడెంట్స్ ఎక్కడా జగన్ కు వ్యతిరేక నినాదాలు చేయలేదు.కేవలం పవన్ కు మద్దతుగానే నినాదాలు చేశారు.వాటిని అక్రమ కార్యకలాపాలు అంటూ విద్యార్థులను సస్పెండ్ చేయడం విమర్శలకు తావిస్తోంది.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులోని ఆదిత్య వర్సిటీ మీదుగా జగన్ బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం కొనసాగింది.జగన్ దృష్టిని ఆకర్షించాలనుకున్న వర్సిటీ యాజమాన్యం… థాంక్యూ సీఎం సార్ అంటూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీని విద్యార్థులకు ఇచ్చి జగన్ కు మద్దతుగా నినాదాలు చేయించాలనుకున్నారు.
వర్సిటీ విద్యార్థుల సమూహాన్ని చూసి జగన్ వర్సిటీ యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం జగనన్న విద్యా దీవెన అందుతుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది విద్యార్థులు బాబులకే బాబు.. పవన్ కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేయడంతో జగన్ అసహనానికి లోనయ్యారు.దాంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
జగన్ దృష్టిని ఆకర్షించి మెప్పు పొందాలని తాము తలిస్తే విద్యార్థులు ఆ నినాదాలు చేయడంతో తమ ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకున్నట్టుంది వర్సిటీ యాజమాన్యం. అందుకే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేస్తూ సర్క్యులర్ విడుదల చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.