వైఎస్ కుటుంబాన్ని నిట్ట నిలువగా చీల్చడంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిది కీలక పాత్రగా మారింది. వైఎస్ అండతో డబ్బులు సంపాదించుకుని ఇప్పుడు ఆ కుటుంబానికే వెన్నుపోటు పొడిచారు. జగన్ రెడ్డికి అండగా ఉంటూ విజయమ్మ, షర్మిలపై బరుద చల్లేందుకు వీరు చేసిన ప్రయత్నాలు వారి క్యారెక్టర్ ను మరోసారి ప్రజల ముందు ఉంచాయి. విజయమ్మ రాసిన లేఖలో సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎంత నీచానికి ఒడిగట్టారో స్పష్టంగా వివరించింది.
ఎంవోయూలో సాక్షి సంతకాన్ని వైవీ సుబ్బారెడ్డి చేశారు. అయినా దాన్ని విస్మరించి ఆస్తులపై జగన్ వాదనను వినిపించారు. కుటుంబం అంతా కలిసి తీసుకున్న ఆస్తుల పంపిణీ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారో సుబ్బారెడ్డి జగన్ ను నిలదీయలేకపోవచ్చు కానీ.. ఆయన కనీసం అవాస్తవాలు ఆడకుండా ఉండటానికి అవకాశం ఉంది. నోరు తెరవకుండా ఉన్నా అది… వైఎస్ కుటుంబానికి ఆయన ఇచ్చే గౌరవం అనుకోవచ్చు.
ఇక విజయసాయిరెడ్డి .. వైఎస్ దగ్గర లెక్కలు చూసేందుకు చేరిన ఓ ఆడిటర్. తర్వాత ఆయన దొంగ లెక్కల్లో పండిపోయారు. ఆస్తుల వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. ఆయన కూడా అదంతా జగన్ ఆస్తి అనడమే కాదు.. పసుపుచీర కట్టుకుని చంద్రబాబును ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించిందని నీచమైన ఆరోపణలు చేశారు. ఇలా మాట్లాడటంపై విజయమ్మ కూడా ఆవేదన చెందుతున్నారు. తన బిడ్డలపై బయట వ్యక్తులు, తమ ఇంట్లో పని మనుషులు ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఏ తల్లి మాత్రం భరించగలదు. మొత్తంగా వైఎస్ కుటుంబానికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చేసినంత ద్రోహం ఎవరూ చేసి ఉండరేమో ?