మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 24న విడుదలవుతున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. మిక్కి జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.