ఆంధ్రజ్యోతిపై తిరుపతి కోర్టులో పరువు నష్టం దాఖలు చేసి.. వేమూరి రాధాకృష్ణను జైలుకు పంపడమో.. ఇంకోటో చేయాలన్న టాస్క్‌ను సీఎం జగన్ నుంచి తీసుకున్న సుబ్రహ్మణ్య స్వామికి దారి తెలుస్తున్నట్లుగా లేదు. తిరుపతిలో కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదాలకు హాజరవుతున్న ఆయన తాజాగా.. వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన లాయర్ కాదని.. లాయర్ కాకుండాఎలా వాదనలు వినిపిస్తారని ఇతర న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ఎవరైనా నిందితుడికి లాయర్‌ను పెట్టుకునే స్థోమత లేకపోతే.. తనంతట తాను వాదించుకునేందుకే అనుమతి ఇస్తారని.. ఇలా పిటిషన్లు దాఖలు చేసిన వారు ఎలా వాదిస్తారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయస్థానం కేసును 11వ తేదీకి వాయిదా వేసింది.
లిటిగేషన్ల సుబ్రహ్మణ్య స్వామిని అందరూ లాయర్ అనుకుంటారు. ఎందుకంటే ఆయన సంచలనాత్కక సంఘటనలు చోటు చేసుకున్న పిటిషన్లు దాఖలు చేయడం ద్వారానే పాపులర్ అయ్యారు. జయలలిత అక్రమాస్తుల కేసులు.. ప్రస్తుతం సోనియా, రాహుల్ ఈడీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిన కేసులూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ల ద్వారా వచ్చినవే. అయితే ఆయన లాయర్ కాదు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. వివాదాస్పద పిటిషన్లు దాఖలు చేసి వాటిపై ఇతర లాయర్లను పెట్టుకుని వాదించి ఆదేశాలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన తన గురించి తాను మర్చిపోయారో లేకపోతే అందర్నీ మభ్య పెడదామనుకున్నారో కానీ తిరుపతి కోర్టులో ఏకంగా వాదించేందుకు ప్రయత్నించారు.
సుబ్రహ్మణ్య స్వామి ఇతర లాయర్లను కాకుండా తాను వాదించడానికి ప్రయత్నించడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయన పూర్తిగా తన గురించి మర్చిపోయారని.. ఆయన తనను తాను లాయర్ అనుకుంటున్నారన్న సెటైర్లు పడుతున్నాయి. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక విమానాల్లో తిరుపతి టు ఢిల్లీ వాయిదాలకు తిరుగుతున్నారు. ఆయనకు అంత స్థోమత లేదని.. వైసీపీనే స్పాన్సర్ చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఎటూ ముందుకు కదలడం లేదు. పైగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.