వంశపారంపర్యంగా తాము.. తమ కుటుంబాలే శ్రీవారి అర్చకులుగా ఉండాలని.. ప్రస్తుతం శ్రీవారి ప్రధాన అర్చకునిగా ఉన్నారో లేదో తెలియని రమణదీక్షితులు చాలా కాలంగా పోరాడుతున్నారు. మిరాశీ వ్యవస్థ ఉండాలంటున్నారు. దాని కోసం ఆయన జాతీయ స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి అని లిటిగేషన్ మాస్టర్‌ను పట్టుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం వంశపారపర్య అర్చకుల్ని కూడా శాశ్వత ఉద్యోగులుగా మార్చేయడంతో మరోసారి ఆవేశపడి.. నేరుగా సుబ్రహ్మణ్య స్వామికి ట్వీట్ చేశారు. న్యాయపోరాటం చేద్దామా సలహా చెప్పాలని కోరారు.
ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి తిరుపతికి వచ్చి .. అసలు బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేయాలా అని ప్రశ్నించారు. దీంతో రమణదీక్షితులకు మాత్రమే కాదు. అందరికీ మైండ్ బ్లాంక్ ్యింది. బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. వంశపారంపర్య.. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి మాటలతో రమణదీక్షితులకు మామూలు షాక్ తగిలి ఉండదు.
జగన్ కోరిక మేరకు.. ఆంధ్రజ్యోతి దినపత్రిపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఆయన అ పిటిషన్‌పై విచారణకు తిరుపతికి వస్తున్నారు. ఆ కేసు ఎటూ తేలడం లేదు. టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు పరువు నష్టం దావా వేశానని కవర్ చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా వైసీపీకి.. రమణ దీక్షితులకు నిరాశకలిగిస్తున్నారు.