మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ప్రాజెక్ట్ ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మంగళగిరిలో స్థలాన్ని కేటాయించారు. నిర్మించే వరకూ ఎంపీలతో ఫాలో అప్ చేయించారు. 21014లో ప్రభుత్వం ఏర్పడితే.. 2015లోనే శంకుస్థాపన చేయించారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చేశారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటి ఎయిమ్స్.
2018లో రూ.1,618 కోట్లతో పనులు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటి ఎయిమ్స్. ఎయిమ్స్‌లో ఇప్పటికే యూజీ కోర్సు నిర్వహిస్తున్నారు. త్వరలో పీజీ కోర్సును ప్రారంభించనున్నారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఒక్క ఏపీ నుంచే కాక ఇతరరాష్ట్రాల నుంచి రోగులు ఇక్కడకి వస్తున్నారు. ఎయిమ్స్-మంగళగిరి సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగులతో కిటకిటలాడుతోంది. ఆసుపత్రి అందించే సేవలను విస్తరించడంతో ఇన్‌పేషెంట్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సర్జికల్ ఆంకాలజీతో సహా 10 రకాల సూపర్-స్పెషాలిటీ సేవలు మరియు 20 రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. సేవల్ని అంతకంతకూ విస్తరిస్తున్నారు. 950 పడకల సామర్థ్యానికి విస్తరిస్తున్నారు.
గత ప్రభుత్వం ఎంత సాయం కావాలంటే అంత సాయం చేసి ఆస్పత్రిని పెట్టేలా చేస్తే.. వైసీపీ సర్కార్ మాత్రం..కనీసం నీళ్లు అందించడానికికూడా ఏర్పాట్లు చేయలేదు. సమీపంలోనే కృష్ణా ఉన్నా.. అవసరమైన నీటి కోసం .. చేయాల్సిన పనులు చేయడంలేదు. దీంతో ఎయిమ్స్ యాజమాన్యం.. ట్యాంకర్లపై ఆధారపడుతోంది. ఎక్కడ మోదీ ప్రభుత్వానికి పేరు వస్తుందోనని ఏపీ సర్కార్ ఈ ఆస్పత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవసరమైన నీరు అందించడానికి కూడా తటపటాయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.