భారత చలన చిత్ర రంగంలో తెలుగు పరిశ్రమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ సినిమాలకు మంచి ఆదరణ పొందుతుందని బాలీవుడ్ స్టార్ హీరోలకు తెలుసు. అందుకే అప్పుడప్పుడు మన మార్కెట్ మీద కన్నేసి ఉంచుతారు. సౌత్ సినిమాల్లో తెలుగు పరిశ్రమ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుండటం విశేషం. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఎన్నో అద్బుతమైన సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చాయి.
రఘువరన్ బి టెచ్ అనే తమిళ డబింగ్ సినిమాతో మొదలైన 2015 తెలుగు సిని పరిశ్రమ పటాస్ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచేలా చేసుకున్నాడు. ఇక సంక్రాంతి సీజన్లో వచ్చిన టెంపర్ కూడా బాగానే పేలినా ఎన్.టి.ఆర్ కు 50 కోట్ల మార్క్ టచ్ చేయడంలో నిరాశ చెందింది.
తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాలకు చాటి చెప్పిన సినిమా బాహుబలి. రాజమౌళి అద్భుత శిల్పంగా చెక్కిన బాహుబలి మొదటి పార్ట్ సంచలన విజయం అందుకుని ఇండియన్ సినిమాలోనే చరిత్ర సృష్టించిన సినిమాగా, సౌత్‌లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది. అంతేకాదు కలక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా 600 కోట్లు సాధించడం జరిగింది. ఇక ఆ సినిమా తర్వాత వచ్చిన సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శ్రీమంతుడుతో మహేష్ నిర్మాణ రంగంలో ప్రవేశించడం విశేషం. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి టోటల్ కలక్షన్స్ తో కేక పెట్టించేలా చేశాడు భలే భలే మగాడివోయ్ నాని. సినిమా బడ్జెట్ కి వచ్చిన లాభాలను లెక్కలేస్తే ఈ సినిమా ఈ ఇయర్ హిట్ సాధించిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంటుంది.
ఇక ఈ మధ్య వచ్చిన చిన్న సినిమా రాజు గారి గది కూడా ఊహించని విజయం సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నెల రిలీజ్ అయిన 6 స్ట్రైట్ సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాల్లో ఏది హిట్ మార్క్ టచ్ చేయలేదు సరికదా అన్ని సినిమాల్లో స్టార్ హీరోల స్పూఫ్ లతో రొటీన్ కామెడీతో నడిపించేశారు. అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలు లారెన్స్ గంగా హిట్ అవగా, నయనతార మయూరిగా కూడా అందరిని భయపెట్టి సూపర్ హిట్ కొట్టింది. ఇక రాక్షసుడుగా సూర్య, జిల్లా, పులి విజయ్ వచ్చినా లాభం లేకుండా పోయింది. ఇక ఈ నెల 25న రిలీజ్ అయిన భలే మంచి రోజు సినిమా సుధీర్ ని స్టార్ చేసినట్టే అని అంటున్నారు. సినిమా దర్సకుడి ప్రతిభ అందరు మెచ్చుకునే విధంగా ఉంది.
మొత్తానికి తెలుగులో 170 సినిమాలు రిలీజ్ అవగా దానిలో 10 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలవలేదు అన్నది తెలుస్తుంది. ఇక కాకతీయ వీరనారి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రుద్రమదేవి, సినిమ చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలు హిట్ సినిమాలుగా నిలిచాయి. రవితేజ బెంగాల్ టైగర్, అసుర, టైగర్ సినిమాలు యావరేజ్ సినిమాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఎన్నో భారీ అంచనాలతో అక్కినేని నట వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని సినిమా అఖిల్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడం అక్కినేని అభిమానులతో పాటు కింగ్ నాగార్జునని తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.