చేతిలో సాక్షి పేపర్ ఉందని ఇష్టం వచ్చినట్లుగా అవినీతి ఆరోపణలు రాయించడం కామనే. అయితే కొంత మంది అలాంటి ఆరోపణల్ని సహించరు. తిరగబడతారు. చిత్తూరు సాక్షి ఎడిషన్ మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గుప్పిట్లో ఉంచుకుంటారు. తన ఇష్టం వచ్చినట్లుగా పులివర్తి నానితో పాటు.. ఆయన సతీమణి సుధారెడ్డిపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు చేయిస్తూ కథనాలు రాయిస్తున్నారు. దీంతో సుధారెడ్డికి సహనం నశించింది. ఆమె తనపై సాక్షిలో రాయిస్తున్న ఆరోపణలకు ఆధారాలు తీసుకుని క్లాక్ టవర్ వద్దకు రావాలని సవాల్ చేసి.. ఆమె అనుకున్న సమయానికి అక్కడికి వెళ్లారు.కానీ చెవిరెడ్డి మాత్రం అడ్రస్ లేరు. సుధారెడ్డి పోన్ చేసినా స్పందన లేదు.
నేను లంచాలు తీసుకున్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు.. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సుధారెడ్డి సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. నేను, నా భర్త ప్రజాసేవకే అంకితమయ్యామని.. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే మా కుటుంబానికి తెలుసన్నారు. మీ కుటుంబ సభ్యుల పేరిట సుమారు 400 ఎకరాలు కబ్జా చేసిన విషయం సాక్షాదారాలతో సహా నిరూపిస్తున్నానని..
మీరు గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, తుడా ఛైర్మన్ గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారని చెవిరెడ్డి అక్రమ ఆస్తుల వివరాలు నా దగ్గర ఉన్నాయని సుధారెడ్డి ప్రకటించారు.
నేను అవినీతికి పాల్పడ్డానని ఆధారాలు ఉంటే టవర్ క్లాక్ దగ్గరకు తీసుకురావాలన్నారు. మీ అవినీతి అక్రమాల చిట్టా సాక్షాదారాలతో సహా నా దగ్గర ఉన్నాయన్నారు. నీలో మార్పు రాకుండా… మాపై ఇలాగే దుష్ప్రచారం చేస్తే తుమ్మలగుంటలోనే నీ ఇంటి వద్దకే వస్తామని హెచ్చరించారు. గంజాయి అమ్ముకుని అన్యాయంగా ,అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న మీకు మహిళల పట్ల గౌరవం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. చెవిరెడ్డి అసలు స్పందించకపోవడంతో వైసీపీ నేతలు ఆయనపై సెటైర్లు వేసుకుంటున్నారు.