ప్రేమకథా చిత్రమ్ తరవాత సుధీర్ ఖాతాలో చెప్పుకోదగిన హిట్ లేదు. భలేమంచి రోజు ఏవరేజ్ టాక్ తెచ్చుకొంది అంతే. అయితే ఈ ప్రయాణంలో సుధీర్ చాలా జోనర్లు టచ్ చేశాడు. యాక్షన్, మాస్ మసాలా, హారర్, థ్రిల్లర్… అన్నిట్లోనూ ఓ చేయి వేశాడు. రొమాంటిక్ కామెడీ సినిమా మాత్రం ‘సమ్మోహనం’తో చేశాడు. సుధీర్‌లో ఉన్న చాలా మైనస్సులని ఈ సినిమా కవర్ చేసేసింది. ఇప్పటి వరకూ సుధీర్ బాబులో ఏవైతే లోపాలుగా అనుకుంటున్నారో, అవన్నీ కప్పేసింది. రొమాంటిక్ కామెడీ సినిమాల్ని సుధీర్ బాగా డీల్ చేయగలడని ఈ సినిమా రుజువు చేసింది. నిజానికి రొమాంటిక్ కామెడీ జోనర్ అందరికీ పట్టేది కాదు. యంగ్ హీరోలంతా.. వేర్వేరు జోనర్లు ప్రయత్నిస్తూ రొమాంటిక్ కామెడీని మర్చిపోయారు. ఈ దశలో సుధీర్ దాన్ని అందిపుచ్చుకోగలిగాడు. ఇక మీదట సుధీర్ ఈ తరహా కథల్ని ఎంచుకోవడం మంచిదేమో అనిపిస్తోంది. సుధీర్ బాబు నిర్మాతగా రాబోతున్న ‘నన్ను దోచుకుందువటే’ కూడా రొమాంటిక్ కామెడీనే. అది కూడా హిట్టయితే… ఇక కొన్నాళ్ల పాటు సుధీర్‌కి ఇలాంటి స్క్రిప్టులే అందొచ్చు. సుధీర్ కూడా యాక్షన్ సినిమాల జోలికి పోకుండా… ఈ తరహా కథల్ని ఎంచుకుంటే, కథానాయకుడిగా తన కెరీర్‌కీ, తెలుగు సినిమాలకూ కాస్త మేలు చేకూరుతుంది.