పలాసతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణకుమార్. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం మొదలెట్టేశారు. గోలీసోడాలు చూపించి… `ఇవి మీకు గుర్తున్నాయా..` అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గోలీసోడాని చూపిస్తున్నారంటే ఇది 1980 నాటి కథే. ఈ కథకూ సోడాకూ లింకుంది కూడా.
అన్నట్టు ఈ సినిమాకి `శ్రీదేవి సోడా సెంటర్` అనే పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. ఈరోజు సాయింత్రం 4 గంటలకు.. మోషన్ పోస్టర్ని విడుదల చేయబోతోంది చిత్రబృందం. టైటిల్ కూడా బయటపెడుతుందేమో చూడాలి. శ్రీదేవిగా ఎవరు కనిపిస్తారన్నదీ ఆసక్తికరమే. `పలాస` కూడా రెట్రో కథే. ఆనాటి వాతావరణాన్ని కరుణ కుమార్ బాగానే ఆవిష్కరించాడు. ఈసారీ అదే జోనర్లో సినిమా తీస్తున్నాడు. కాకపోతే.. ఇది పలాస టైపులో భావోద్వేగభరితమైన కథ కాదట. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.