హిట్లూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తున్నాడు సుధీర్ బాబు. చేసిన జోనర్ మళ్లీ చేయకుండా కొత్త కథల్నిఎంచుకోవడం సుధీర్ స్పెషాలిటీ. ఇప్పుడు మరో కొత్త తరహా జోనర్లో సినిమా చేస్తున్నాడు. అదే `హరోం హర`. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకుడు. ఈమధ్యే అధికారిక ప్రటకన వచ్చింది. ఈరోజు..’హరోం హర’ టైటిల్ ఖరారు చేశారు. దాంతో పాటు ఓ మోషన్ వీడియోని కూడా విడుదల చేశారు. ఈ టీజర్ లో… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా చూపించారు. థియేటర్, గుడి, డబ్బు… ఇలా రకరకాల కోణాల్లో ఈ కథ సాగుతుందని అర్థమవుతోంది. ఈమధ్య మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ‘హరోం హర’లో కూడా ఆ పాయింట్ ని బలంగా వాడుతున్నట్టు కనిపిస్తోంది. 1889 యప్రాంతంలో చిత్తూరులోని కుప్పం నియోజక వర్గం చుట్టూ తిరిగే కథ ఇది. ప్రధాన పాత్రలన్నీ చిత్తూరు మాండలికంలోనే మాట్లాడబోతున్నాయి. ఇందుకోసం సుధీర్ బాబు చిత్తూరు యాస కూడా నేర్చుకొన్నాడు.