సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. కెరీర్ ప్రారంభించగానే సొంత ఇల్లు ఉండాలని ఇప్పుడు అనుకుంటున్నారు. కనీసం పెళ్లి అయి పిల్లలు ఉన్నప్పటికైనా సొంత ఇల్లు ఉంటే ప్రశాంతంగా బతకవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోతోంది. ఎవరికి వారు వ్యక్తిగత స్వేచ్చా కోరుకుంటున్నారు. పర్సనల్ స్పేస్ ఉండాలని అనుకుంటున్నారు. పిల్లలకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా రూమ్స్ అడ్జస్ట్ చేయాల్సి వస్తోంది. టెక్నాలజీ పెరిగింది మనుషులు దూరమవుతున్నారు. మధ్యరగతి వారు కూడా తమను తాము మార్చుకోకతప్పదు.
ఇలాంటి సమయంలో ఎంత సైజులో ఇల్లు అయితే సౌకర్యవంతంగా ఉండొచ్చన్న ప్రశ్న వస్తోంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రిపుల్ బెడ్ రూం ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎదిగిన పిల్లలు అయితే రూమ్ షేర్ చేసుకోరు. ఎదుగుతున్న పిల్లలు అయితే సర్దుకుంటారు. కానీ తర్వాత అయిన తమ రూమ్ తమకు కావాలని వారు కోరుకుంటారు. అందుకే ట్రిబుల్ బెడ్ రూం బెటర్. ఇప్పుడు పన్నెండు వందల Sftల్లో ట్రిబుల్ బెడ్ రూమ్ ను బిల్డర్లు ప్లాన్ చేస్తున్నారు.
ఒక్క బిడ్డ ఉంటే డబుల్ బెడ్ రూం బెటర్. వెయ్యి ఎస్ఎఫ్టీలో ఇప్పుడు మంచి డబుల్ బెడ్ రూం ఇళ్లు లభిస్తున్నాయి. తల్లిదండ్రులను చూసుకోవాలంటే వారి కోసం ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో.. జారని విధంగా ఉండే బాత్ రూమ్ టైల్స్ తో రూమ్ ను డిజైన్ చేయించుకోవడం ఉత్తమం. ఒకప్పుడు ఒక సింగిల్ బెడ్ రూం ఉంటే చాలని మధ్యతరగతి ప్రజలు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కనీసం త్రిబుల్ బెడ్ రూం గురించి ఆలోచిస్తున్నారు. అభిరుచులు మారుతున్న కొద్దీ.. ఆదాయం మారుతున్న దాన్ని బట్టి ఇళ్ల నిర్మాణం, అమ్మకాల్లో మార్పులు కూడా వస్తున్నాయి.