సుహాస్ తెలుసు కదా? యూ ట్యూబ్ నుంచి సినిమా నటుడిగా ఎదిగాడు. ఈమధ్య చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. కలర్ ఫొటోతో హీరో అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగైదు సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఇటీవలే ఓ కొత్త సినిమాకి సంతకం చేశాడు సుహాస్. తన పారితోషికం కూడా దాదాపుగా 40 లక్షల వరకూ చేరింది. అయితే.. ఈసినిమాకి మరో రూ.5 లక్షలు అడిగాడు. కారణం.. గుండు.
కథ ప్రకారం.. ఈ సినిమాలో సుహాస్ గుండు కొట్టించుకోవాలి. అలా కొట్టించుకోవాలంటే రూ.5 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఎందుకంటే.. గుండు కొట్టించుకుంటే, మళ్లీ జుత్తు రావడానికీ, సినిమాల్లో నటించడానికి కాస్త సమయం పడుతుంది. ఆ టైమ్ అంతా.. సుహాస్‌కి వేస్ట్ అయినట్టే. అందుకే.. నష్టపరిహారంగా రూ.5 లక్షలు ఎక్కువగా డిమాండ్ చేశాడట. నిర్మాతలు కూడా అడిగినంత డబ్బు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఆ సినిమా ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లింది కూడా.