మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు సుహాసిని! హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక… మెగా వారసుల సినిమాల్లో మంచి మంచి పాత్రలు పడుతున్నాయి. మిగతా హీరోల సినిమాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నారనుకోండి! తల్లి పాత్రలకు ఆమెను ఏరి కోరి తీసుకుంటున్నారు. ‘వరుడు’లో అల్లు అర్జున్‌కి తల్లిగా నటించారు. ‘గబ్బర్ సింగ్’లో పవన్‌కల్యాణ్‌కి తల్లిగా నటించారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హిట్ సినిమా ‘తొలిప్రేమ’లోనూ ఆమె హీరోకి తల్లిగానే కనిపించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… మెగా వారసురాలు నిహారిక కొణిదెల నటిస్తున్న తాజా సినిమాలో సుహాసిని కీలక పాత్ర చేస్తున్నారు. ‘హ్యాపీ వెడ్డింగ్’ తరవాత నిహారిక రెండు సినిమాలు అంగీకరించారు. రెండిటిలో కెమెరామెన్ జ్ఞానశేఖర్ నిర్మిస్తున్న సినిమా ఒకటి. అందులో శ్రియ, నిహారిక ముఖ్య తారలు. ఇంకొకటి… ప్రణీత్ బ్రమణడపల్లి దర్శకత్వంలో నటిస్తున్నది. ఈయన నిహారికతో వెబ్ సిరీస్‌లు డైరెక్ట్ చేశారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రకు సుహాసినిని తీసుకున్నారు. నిహారికకు తల్లిగా నటిస్తున్నారో? లేదా హీరోకి తల్లిగా నటిస్తున్నారో?? మరో పాత్ర ఏదైనా చేస్తున్నారో?? సమాజంలో ప్రస్తుత యువతీయువకుల ఆలోచనలను ప్రతిభింబించే కథాంశంతో సినిమా రూపొందిస్తున్నారట!!