కలర్ ఫోటో తర్వాత సుహాస్ మళ్ళీ అలాంటి చెప్పుకోదగ్గ విజయం రాలేదు. రైటర్ పద్మభూషణ్ మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది కానీ యునానిమస్ హిట్ కాదు. ఈ ఏడాది అంబాజీ పేట, ప్రసన్న వదనం, జనక అయితే గనక ఇలా వరుస సినిమాలు చేశాడు కానీ అన్నీ బిలో యావరేజ్ దగ్గర ఆగిపోయాయి.
ఇప్పుడు రామ్ గోధాల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ఓ భామ అయ్యో రామ అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫన్నీగా వుంది. ప్రస్తుత జనరేషన్ లో అమ్మాయి అబ్బాయి మధ్య రిలేషన్షిప్ ప్రజెంట్ చేసే కథ ఇది.
సుహాస్ ఈ సినిమా కోసం కాస్త కొత్తగా మేకోవర్ అయ్యాడు. మాళవిక మనోజ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. గ్లింప్స్ లో రిచ్ వింటేజ్ వైబ్ కనిపించింది. రధన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి మణికందన్ డీవోపీ. నువ్వు నేను ఫేం అనిత చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.