సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ హరీశ్ నల్ల నిర్మాత. ఇటివలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి ఫేం రదన్ ఈ సినిమాకి మ్యూజిక్. ఈ టైటిల్ ని సాంగ్ హుషారుగా స్వరపరిచాడు.
‘రంగులరాట్నం మీద తిప్పినట్టు.. రైలు పట్టాలు కొంచెం తప్పినట్టు.. గుండె బిక్కుబిక్కు మంటోంది నివ్వు వస్తే.. అయినా ముద్దుగానే అనిపిస్తేదే నిన్ను చూస్తే.. ఎలా ఉండేవాడిని.. ఎలాగ అయిపోయానే.. ఎరక్కపోయి.. ఇరుక్కుపోయానే..” అంటూ సుహాస్ తనప్రేమలో ప్రేమలో అవస్థని చెప్పే ఈ పాట క్యాచిగా వుంది.
హర్ష ఈమని లిరిక్స్ అందించాడు. శరత్ సంతోష్ ఎనర్జిటిక్ గా పాడాడు. అంతే ఎనర్జీతో కనిపించాడు సుహాస్. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పై కథని రాసుకున్నారు. ఈ సమ్మర్ లోనే సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.