విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించి.. ఉద్యోగులందర్నీ అక్కడికి తరలించి.. అక్కడ్నుంచే పాలన కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడతామని మొదటి సారి జగన్ ప్రకటన చేసినప్పుడు… సుజనా చౌదరి.. మీడియా ముందుకు వచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా.. చేస్తే కేంద్రం ఊరుకోదని హెచ్చరించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ.. ఓ పది సార్లో.. పదిహేను సార్లో ప్రెస్ మీట్ పెట్టి ఉంటారు. ప్రతీ సారి.. జగన్ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే కేంద్రం ఊరుకోదని.. జోక్యం చేసుకుంటుందని చెబుతూ వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం.. కనీసం.. గవర్నర్ వద్ద నుంచి అయినా.. ఓ నివేదిక తెప్పించుకున్న పాపాన పోలేదు.
సుజనా మాత్రం.. జగన్మోహన్ రెడ్డికి.. హెచ్చరికల్లాంటి బెదిరింపులు కేంద్రం పేరుతో చేస్తూనే ఉన్నారు. రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశం పెట్టనున్న సమయంలో.. మరోసారి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టిన సుజనా చౌదరి.. అవే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోర్నారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధాని అని చెప్పి అమరావతికి వచ్చాయని … హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్-6లో స్పష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందన్నారు. ఆ సరైన సమయం అధికారిక ప్రకటన వెలువడటం. నిర్ణయం తీసేసుకున్న తర్వాత కేంద్రం జోక్యం చేసుకుని.. ఏం చేయగలుగుతుందో.. సుజనాచౌదరికి తెలియకుండా ఉంటుందని అనుకోలేం.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్…. అలాగే.. నిర్ణయం తీసుకోక ముందే.. ప్రభుత్వాన్ని నియంత్రించడమే అమరావతి విషయంలో కీలకం. సుజనా మాత్రం… నిర్ణయం తీసుకున్న తర్వాతే కేంద్రం జోక్యం చేసుకుంటుందంటున్నారు. మొత్తంగా.. కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని.. సుజనా చేస్తున్న ప్రయత్నాలు.. మాత్రం ఫలించడం లేదని.. ఆయన మాటలతోనే తెలిసిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.