పార్టీ ఫిరాయించిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ.. సుజనా చౌదరికి అన్నీ కలసి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన మళ్లీ కేంద్రమంత్రి అవుతారని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా.. ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్యూలు ప్రసారం చేస్తోంది. బీజేపీ అగ్రనేతలు కూడా.. సుజనా చౌదరిపై సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ముందుగా.. టీడీపీ నుంచి సుజనా ఒక్కరే.. బీజేపీలో చేరుతారని అనుకున్నా… ఆయన చొరవతోనే .. మిగతా ముగ్గురూ బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. ఈ కృతజ్ఞతతోనే.. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఏపీ నుంచి కేంద్రంలో సుజనా చౌదరినే..!?
సాధారణంగా.. కేంద్రమంత్రివర్గంలో ప్రతీ రాష్ట్రానికి.. కనీసం ఓ మంత్రి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటారు. సమాఖ్య వ్యవస్థలో ఇది ముఖ్యం కూడా. అయితే.. భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా.. ఏపీ, తెలంగాణ, కేరళ్లలో… ఎవరూ గెలవలేదు. కానీ.. కేరళ నుంచి మాత్రం.. ఓ బీజేపీ సీనియర్ నేతకు.. కేంద్రమంత్రిగా చాన్సిచ్చారు. తెలంగాణ, ఏపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే మిత్రపక్షంకు.. పెద్ద ఎత్తున రాజ్యసభ సభ్యులు ఉన్నా… ఒక్క లోక్సభ ఎంపీ ఉన్నా… అవకాశం ఇవ్వలేదు. ఏపీలో.. అలాంటి అవకాశాలు కూడా.. లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యులు లేరు.. అధికారిక మిత్రపక్షాలు కూడా లేరు. అందుకే… మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది.
సాంకేతిక ఇబ్బందులు రాకుండానే విలీనం ప్రక్రియ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల చేరికతో.. బీజేపీకి ఈ ఇబ్బంది తీరిపోయింది. గతంలో సుజనా మోడీ కేబినెట్లోనే మంత్రిగా చేశారు. ఆ సమయంలో.. ఆయన బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఎంతగా అంటే… ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అది నిజమేనని.. సుజనా చౌదరి కూడా.. ఇంటర్యూల్లో చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలతో… ఏపీ నుంచి.. సుజనానే కేంద్రమంత్రి కావడం ఖాయమని… చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండానే.. విలీనం ప్రక్రియ పూర్తి చేశారని అంటున్నారు.
వైసీపీ ఉలికిపాటు కూడా అందుకే..!?
సుజనాకు మంత్రి పదవి ఖాయమని తెలిసిన తర్వాతే.. వైసీపీలో కంగారు ప్రారంభమయిందని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మామూలుగా అయితే.. విజయసాయిరెడ్డి.. కేంద్రమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అది సుజనా చౌదరికి దక్కే సూచనలు ఉండటం.. ఒక వేళ ఆయన… మంత్రి అయితే.. ఏపీలో.. వైసీపీనే శత్రువుగా చూస్తారన్న విషయం క్లారిటీగా ఉండటంతో.. వైసీపీ నేతలు.. మరో తరహా ప్రచారం ప్రారంభించారంటున్నారు. టీడీపీ – బీజేపీ కుమ్మక్కయ్యాయని అంటున్నారు. ముందు ముందు.. ఈ రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది.