తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి… భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా.. సూచనలు పంపుతున్నారు. ఎన్నికల సమయంలో.. ఆయన కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో… అలాగే అసంతృప్తులను బుజ్జగించడంలో.. ఆయన నేతృత్వంలోని కమిటీనే చురుకుగా వ్యవహరించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన సైలెంటయిపోయారు. తాజాగా కొన్ని టీవీ చానళ్లకు.. ఇంటర్యూలు ఇస్తూ.. టీడీపీ అధినేతపై… విమర్శలు చేస్తున్నారు. ఇదే టీడీపీలో కొత్త సంచలనం అయింది.
తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబు.. మనుషుల కన్నా.. మెషిన్లనే ఎక్కువగా నమ్ముకున్నారని.. సుజనా చౌదరి.. ఓ తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో విమర్శించారు. తాను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే .. పార్టీలో అందరికీ చెప్పే వెళ్తానన్నారు. టీడీపీ అధినేత తీరుపై.. పలు రకాల విమర్శలు చేశారు. అయితే.. ఎక్కడా ఘాటుగా లేకుండా… లోపాలు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. చివరిలో బీజేపీకి వెళ్లే ప్రసక్తే లేదని.. గతంలో చెప్పినట్లుగా చెప్పలేదు. వెళ్లేపని అయితే.. అందరికీ చెప్పే వెళ్తానన్నారు. ఈ విషయంలో… ఆయన టోన్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
సుజనాచౌదరి.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ… పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తూ… పైకి వచ్చారనే పేరు ఉంది. అందుకే ఆయనకు.. రాజ్యసభ హోదా మాత్రమే కాదు.. కేంద్రమంత్రి పదవి కూడా చంద్రబాబు ఇప్పించారని అంటున్నారు. అయితే… ఆయనపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అనేక ఆర్థిక అవకతవకల కేసులు ఉన్నాయి. ఈడీ వెంటాడుతోంది. ఈ క్రమంలో మరో ఐదేళ్ల పాటు.. వీటిని భరించాలంటే.. సాధ్యమయ్యే పని కాదని.. సుజనా చౌదరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఇప్పటికి సైలెంట్‌గా జరుగుతోంది. దీని ఫలితం.. త్వరలో చేరిక రూపంలో.. కనిపించే అవకాశం ఉంది.