భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనా చౌదరి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే.. ఆయన తన పాత డైలాగ్ ను మాత్రం మార్చలేదు. ఏపీ సర్కార్ ఇలాగే వ్యవహరిస్తూంటే.. కేంద్రం చూస్తూ ఊరుకోలేదని.. అంతిమంగా డైలాగ్ చెప్పారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన సుజనా చౌదరి.. కొరియా నుంచి తెప్పించిన టెస్టింగ్ కిట్లపై విమర్శలు గుప్పించారు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి టెస్టింగ్ కిట్లు ఉత్పత్తి అవుతూండగా…కొరియా నుంచి ఎందుకు తెప్పించాల్సివచ్చిందని ప్రశఅనించారు. వైసీపీకి మంచి మెజార్టీ ఉంది… ప్రజల మెప్పు పొందేలా పాలన చేయాలని… అసంఘటితరంగ కార్మికులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు.
కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని.. హెచ్చరించారు. పది నెలలు దాటిపోతున్నా.. ఇప్పటి వరకూ.. వైసీపీ పాలనపై దృష్టిపెట్టడంలేదని..కేవలం రాజకీయ కక్షపైనే వైసీపీ దృష్టి సారించిందని విమర్శించారు. ఏపీలో వైసీపీ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాజకీయం చేస్తోందన్నారు. ఏపీలో అధికారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని … రాగద్వేషాలు, రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సి ఉందన్నారు. పాలనలో విఫలమైతే… ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధానిగా అమరావతిని మార్చాలనుకున్న జగన్ నిర్ణయంపై మొదట్లో విమర్శలు చేసిన సుజనా చౌదరి… ప్రతీ వారం..అమరావతికి వచ్చి.. ప్రభుత్వంపై ాగ్రహం వ్యక్తం చేసేవారు. కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించేవారు. అయితే ఇప్పటి వరకూ..కేంద్రం చూస్తూ ఉరుకుంది. పైగా.. సహకరిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి సమంయలో తెరపైకి వచ్చిన సుజనా..మరోసారి అదే డైలాగ్ చెప్పారు.