‘సాహో’ దర్శకుడు సుజిత్ ట్విట్టర్ పిట్ట ఐదు నెలలుగా ఒక్కసారి కూడా కూయలేదు. అసలు ఉలుకు లేదు. పలుకు లేదు. వాయిస్ వినపడలేదు. ఈ రోజు మాత్రం అర్జెంటుగా ఓ వాయిస్ వినిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు తనపై వస్తున్న పుకార్ల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌తో గొడవలు లేవని దర్శకుడు సుజిత్ ట్విట్టర్ సాక్షిగా స్పష్టం చేశాడు. సుజిత్ దర్శకత్వం మీద నమ్మకం కోల్పోయిన ప్రభాస్, సినిమాటోగ్రాఫర్ మది సలహాలు తీసుకుంటున్నాడని… హీరో, దర్శకుల మధ్య గొడవలు తలెత్తాయని వచ్చిన పుకార్లపై సుజిత్ స్పందించాడు. అందరం కలిసి హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నామని, ఇటువంటి వార్తలు మాకు వినోదం అనుకోండని ట్వీట్ చేశాడు. ‘సాహో’ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేనందువల్ల ఫ్యాన్స్‌లో కలుగుతోన్న ఫ్రష్ట్రేషన్ తనకు అర్థమవుతుందని, ఏప్రిల్ కల్లా ఎంత షూటింగ్ అయితే అంతవరకూ అప్డేట్ ఇప్పిస్తానని అభిమానికి ప్రామిస్ చేశాడు. సినిమా టీమ్ అందరం కష్టపడి వర్క్ చేస్తున్నామని సుజిత్ అన్నాడు.
సుజిత్ ట్వీట్స్:
https://twitter.com/sujeethsign/status/973812366478594048
https://twitter.com/sujeethsign/status/973815647485521920