పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా. అయితే పుష్ప సినిమా మొదలైనప్పుడు పాన్ ఇండియా అలోచన లేదు. రాజమౌళి ఇచ్చిన సలహాతో పాన్ ఇండియా వైపు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ పుష్ప ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.
” నా ద్రుష్టి తెలుగుపైనే వుంది. ముందు తెలుగు ఆడియన్స్ ని సంతోష పెట్టాలి. అదే నా ఆలోచన. మళ్ళీ అన్నీ భాషల్లో అంటే సరిగ్గా చేయగలమో లేదో ? అనే మీమాంస వుండేది. ఇలా డైలమాలో వున్నప్పుడు రాజమౌళి గారు ఫోన్ చేసి.. ‘నీది పాన్ ఇండియా సినిమా. నీవు తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా అవుతుంది. పాన్ ఇండియాలో చేస్తే పాన్ ఇండియా సినిమా అవుతుంది. మరో ఆలోచన లేకుండ పాన్ ఇండియా లో విడుదల చేయ్’ అని గట్టిగా చెప్పారు. ఆ సలహాతో పాన్ ఇండియాపై ద్రుష్టి పెట్టా. కానీ పాన్ ఇండియా పనులు చాలా వరకు మా నిర్మాతలు, బన్నీ చేసుకున్నారు” అని చెప్పుకొచ్చారు సుకుమార్.