‘రంగస్థలం’కి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రేక్షకుల్లోనూ బజ్ బాగుంది. అమెరికాలో షోస్ పడడానికి ఇంకెంతో టైమ్ లేదు. ఇటువంటి సందర్భంలో సుకుమార్ సినిమాపై కాస్త అంచనాలు తగ్గించే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేక్షకులందర్నీ థియేటర్లకు తెల్ల కాగితాలు వలే రమ్మని కోరారు. అలా వస్తే.. మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని సుకుమార్ విన్నవించుకున్నారు. భారీ అంచనాలతో థియేటర్లకు రావొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ సినిమా పాటలు బీభత్సమైన హిట్. ట్రయిలర్ జనాలకు ఎక్కింది. అయితే… సినిమాలో కామెడీ ఎక్కువ లేదట. ముఖ్యంగా ద్వితీయార్థంలో ట్విస్ట్ రివీల్ అయిన తరవాత హెవీ ఎమోషనల్ అండ్ డ్రామా మోడ్లో సాగుతుందట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాస్ ప్రేక్షకుల కోసం సుకుమార్ అలా చెప్పారట. మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మాత్రం సినిమా అంచనాలను అందుకుంటుందని ధీమాగా వున్నారు. ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో?