సురేందర్ రెడ్డి. ఓ హిట్టు..ఓ ఫ్లాపు అంటూ సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీలో పెద్ద డైరక్టర్ల జాబితాలో చోటు తెచ్చుకున్న డైరక్టర్. ప్రస్తుతం చేస్తున్న సినిమా మెగాస్టార్ సైరా. అక్టోబర్ 2న విడుదలకు రెడీ అయిపోతోంది. తరువాత ఏంటీ? అన్నది క్వశ్చను.
పెద్ద డైరక్టర్లు అంతా తలా హీరో లకు లైన్ లు చెప్పి, క్యూలో వున్నారు. మరి సురేందర్ రెడ్డి సంగతేమిటి? సైరా తరువాత కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, మరో ఆరు నెలల్లో ఏదో సినిమా స్టార్ట్ చేయాలి. అదే..ఎవరితో? అన్నది క్వశ్చను. సురేందర్ రెడ్డికి మహేష్ బాబుతో సినిమా చేయాలని వుంది అని తెలుస్తోంది.
అయితే సురేందర్ రెడ్డితో బన్నీ సినిమా చేయించే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. కానీ ఇద్దరు హీరోలు ఖాళీ లేరు. మహేష్ ముందు రెండు కమిట్ మెంట్ లు వున్నాయి. బన్నీ ముందు రెండు కమిట్ మెంట్ లు వున్నాయి. మహేష్ దగ్గర అయినా, బన్నీ దగ్గర అయిన ఫుల్ గా ఫైనల్ కాని కమిట్ మెంట్ అంటే సుకుమార్ దే. సైరా హిట్ అయి, సురేందర్ మంచి లైన్ చెబితే ఇటు మహేష్ దగ్గర అయినా, బన్నీ దగ్గర అయినా బ్రేక్ పడేది సుకుమార్ సినిమాకే.
అందుకే ముందు జాగ్రత్తగా బన్నీ దగ్గర సినిమా ఓపెన్ అయిపోయి లైన్ లో వుంది అనిపించుకునే ప్రయత్నాల్లో సుకుమార్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారట.
ఆ ప్రయత్నాలు ఫలిస్తే అక్టోబర్ లో ఓపెనింగ్ వుండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.