”పుష్ప’ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దర్శకుడు సుకుమార్ చెప్పిన ‘సెన్స్ లెస్.. చేంజ్ లెన్స్’ కథ నవ్వు తెప్పించింది. పుష్ప సినిమాకి కెమరా క్యూబా. పోలెండ్ వాసి. తెలుగు అర్ధమవ్వడం కష్టం. అలాగే అతను ఇంగ్లీష్ మాట్లాడితే అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. ఇలాంటి కష్టమే సుకుమార్ కి వచ్చింది. సెట్ లో షాట్ చెప్పినపుడు చేంజ్ లెన్స్ అనేవారట సుకుమార్. దానికి సమాధానంగా ”సెన్స్ లెన్స్’ అనేవాడట కెమరామన్ క్యూబా. దీంతో సుకుమార్ కి మండిపోయేది. ఇది చాలా సార్లు రిపీట్ అయ్యింది. దీంతో ఒకసారి ఇంకా ఆపుకోలేక క్యూబాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారట సుకుమార్. ‘అసలు నా గురించి నీకు తెలుసా ? నన్ను సెన్స్ లెన్స్ అంటావా ? అంటూ ఫైర్ అయ్యారట. దీంతో క్యూబా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
తర్వాత అసలు సంగతి అర్ధం చేసుకున్న క్యూబా.. సుకుమార్ దగ్గరికి మళ్ళీ వచ్చి..”సర్ మీరు అపార్ధం చేసుకున్నారు.. నేను కూడా చేంజ్ లెన్స్ అని మీ వంక చూసేవాడిని. అది మీరు సెన్స్ లెన్స్ గా అర్ధం చేసుకున్నారు” అని అసలు వాస్తవం చెప్పాడట. దీంతో సుకుమార్ మనసు తేలిక పడిందట ”తర్వాత మేము ఇద్దరం వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే చేంజ్ లెన్స్ కి బదులు లెన్స్ చేంజ్ అని మాటను మార్చుకున్నాం”అని షూటింగ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ని పంచుకున్నారు సుకుమార్.