సుకుమార్ పుష్ప 2 వర్క్ అంతా పూర్తయింది. ఫైనల్ సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఇప్పుడు సుక్కుకి కొత్త కథలు గురించి అలోచించే సమయం దొరికింది. సుక్కు, రామ్ చరణ్ కథలో బిజీ కావాలి. అయితే ఈలోపు తన బ్యానర్ లోని కథలని రీరైట్ చేసే పనిలో వున్నారు.
సుకుమార్ శిష్యుడు ‘సెల్ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజుతో సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో వుంది. ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకొని ఆగిపోయింది. కథ సెకండ్ హాఫ్ లో ఎక్కడో తేడా కొట్టింది. ఇప్పుడా కథని సుకుమార్ దిద్దుతున్నారు.
అలాగే రామ్ చరణ్ బుజ్జిబాబు కథలో కూడా సుకుమార్ ఇన్వాల్ అవుతాడని తెలుస్తోంది. దినితో పాటు సుకుమార్ బ్యానర్ నుంచి మరో రెండు కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయి. ఆ కథలు కూడా సుకుమార్ సమక్షంలోనే ఫైనల్ అవుతున్నాయి.