సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. 2020 వేసవిలో విడుదల అవుతోంది. అయితే ఇప్పటికి దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. వీఎఫ్ఎక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం కేటాయించారు. ఈలోగా సుకుమార్ కోసం రషెష్‌ని ప్రదర్శించారు. ఏమైనా మార్పులూ, చేర్పులూ ఇప్పుడే సూచిస్తే. సరిద్దిద్దుకోవొచ్చని నిర్మాతల ఉద్దేశం. అయితే సుక్కు ఈ సినిమా చూసి, పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఒక్క మార్పు కూడా చెప్పలేదు. సినిమా బాగా వచ్చిందని, బుచ్చికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే, ఇంకా బాగా తీస్తాడని సుక్కు చెప్పాడట. దాంతో మైత్రీ మూవీస్ కూడా ఊపిరి పీల్చుకుంది. దాదాపుగా 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఓ కొత్త హీరోపై ఈస్థాయిలో ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మైత్రీ మూవీస్ ఒక్క తప్పు కూడా చేయకూడదన్న ఉద్దేశంతో ఈ సినిమాని ముందే సుకుమార్‌కి చూపించింది. ఆయన `ఓకే` అనడంతో మైత్రీ ఇప్పుడు రిలాక్స్ అయ్యింది.