డైలామాలో పడిన మహేష్ బాబు – సుకుమార్ సినిమాకి మళ్లీ కొత్త ఊపిరొచ్చింది. ఇటీవల మహేష్‌ని కలిసిన సుకుమార్ ఓ కథ చెప్పడం, దానికి మహేష్ ‘ఓకే’ అనేయడం జరిగిపోయాయి. మహర్షి పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఇప్పటి వరకూ మహేష్‌కి నాలుగు కథలు వినిపించాడు సుక్కు. అవేమీ అవేం మహేష్‌కి నచ్చలేదు. నాలుగుసార్లు వర్కవుట్ కానిది.. ఈసారి సుకుమార్ కొత్తగా ఏం చెప్పాడు?? మహేష్ ఎలా ఒప్పుకున్నాడు?
ఇక్కడే ఓ ట్రిక్కు ఉంది. మహేష్‌కి గతంలో వినిపించిన ఓ కథనే పాలీష్ చేసి చెప్పాడట సుకుమార్. తన స్క్రీన్ ప్లే కాస్త గజిబిజిగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి గజిబిజిలేం లేకుండా స్ట్రయిట్నేరేషన్ చెప్పేసరికి మహేష్ ఓకే అన్నాడట. ముందు నుంచీ సుకుమార్‌కి మహేష్ చెబుతున్నది కూడా ఇదే. ‘ఫ్లాష్ బ్యాక్‌లు లేని కథ చెప్పు.. లాజిక్కులు వేసుకునే అవసరం ఉండకూడదు’ అంటున్నాడట. ఇప్పుడు సుకుమార్ అదే చేశాడు. అందుకే మహేష్ కూడా ఓకే అనేశాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వన్’ టెక్నికల్‌గా సూపర్బ్‌గా కనిపిస్తుంది. లాజిక్కులు ఎక్కువై ఆడలేదంతే. అయితే ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదన్నది మహేష్ ఆలోచన. దానికి తగిన కథతోనే సుకుమార్ మహేష్‌ని ఒప్పించాడు.