సూపర్ స్టార్ మహేష్ అంటే అందరికి ఇష్టం అలాంటిది తనను చూస్తే సుకుమార్ కు ఎందుకు బాధేస్తుంది.. ఒకవేళ తనకు 1 నేనొక్కడినే లాంటి ఫ్లాప్ ఇచ్చినందుకు బాధగా ఉన్నాడా అంటే అదేం లేదు తనకో హిట్ సినిమా ఇస్తే హ్యాపీ కాని సుకుమార్ మహేష్ ను చూస్తే బాధేసింది మాత్రం తన ఫ్యామిలీ గురించట. సూపర్ స్టార్ గా ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా మహేష్ తన కుటుంబంతో స్పెండ్ చేస్తుండటం చూసి తనకు బాధేస్తుందని అన్నాడు సుకుమార్.
ఇటీవల నాన్నకు ప్రేమతో అంటూ తారక్ తో హిట్ కొట్టిన సుకుమార్ కాకినాడ మలికిపురం మండంలంలోని తన స్వగ్రామ మట్టుపర్రు వెళ్లడం జరిగింది. అక్కడ తన చిన్న నాటి స్నేహితులు ఉన్నారని.. ఎంత డబ్బు సంపాదించినా వారిలో అహంకారం అనేది చోటుచేసుకోదని అన్నారు.
తన తండ్రికి తాను ఏమి ప్రేమను పంచలేకపోయానని.. సినిమా ఒత్తిడి వల్ల హైదరబాద్ లోనే ఉండి సినిమాలతో బిజీ ఉన్నానని అన్నారు. ఇక ఓ పక్క సినిమాలను తీస్తూ తన కుటుంబాన్ని మిస్ అవ్వకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ గురించి ప్రస్థావించడం జరిగింది. ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న ఈ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరు క్యూలో ఉన్నారు.