దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ సుకుమార్ బ్రిలియెంటే. `ఉప్పెన`తో నిర్మాతగా భారీ లాభాల్ని సంపాదించాడు. తన శిష్యుడిని దర్శకుడిగా మార్చిన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఉప్పెన హిట్టులో సగం క్రెడిట్ తనదే.
ఇప్పుడు నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. కార్తికేయతో సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. సెప్టెంబరులో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. దర్శకుడు ఎవరన్నది చెప్పలేదు గానీ, ఈసారీ సుకుమార్ శిష్యుడే మెగా ఫోన్ పట్టబోతున్నాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు.. అన్నీ సుకుమార్ వే. అయితే ఇప్పటి వరకూ సుకుమార్ దగ్గర కథే లేదట. జస్ట్ హీరోని మాత్రం ఎంపిక చేసి పెట్టుకున్నాడు. సుకుమార్ తెలివితేటలు ఏమిటంటే.. ఈసినిమా కోసం కూడా ఆయన ఒక్క పైసా పెట్టుబడి పెట్టడం లేదు. కేవలం నిర్మాతగా తన పేరు కనిపిస్తుందంతే. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చిందో, అప్పుడే చాలామంది నిర్మాతలు సుకుమార్ కి ఫోన్ చేసి `మేం పెట్టుబడి పెడతాం` అని కర్చీఫ్లు వేయడం మొదలెట్టేశారు. `ఉప్పెన` కూడా అంతే కదా. పెట్టుబడి మైత్రీ వాళ్లది. లాభాల్లో వాటా సుకుమార్ ది. ఈసారీ అదే దారిలో వెళ్లబోతున్నాడు. ఇది వరకు మారుతి లాంటి వాళ్లు కూడా ఇలానే.. తమ పేరునే బ్రాండ్ గా వాడుకుంటూ.. డబ్బులు సంపాదించారు. ఇప్పుడు సుకుమార్ కూడా అలాంటి తెలివితేటలే చూపిస్తున్నాడు.