`రంగస్థలం`లో రంగమ్మత్తగా ఆకట్టుకుంది అనసూయ. ఐటెమ్ పాటలు చేసే అనసూయలో ఇంత టాలెంట్ ఉందా? అని ఆశ్చర్యపోయారు. ఆ సినిమా తరవాత తన రూటు మార్చింది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు అనసూయ. ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తోంది. ఇప్పుడు తనకు మరో మంచి ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. సుకుమార్ – మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో రంగమ్మత్తకు మరో మంచి పాత్ర దొరికిందట. అనసూయలోని నటిని మరో స్థాయిలో చూపించే పాత్ర అవుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం `మహర్షి` సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఆ తరవాతే.. సుకుమార్ సినిమా పట్టాలెక్కుతుంది. సుకుమార్ సినిమా అనగానే దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు తప్పనిసరి. వాళ్లిద్దరూ ఈ సినిమాకి ఖాయమయ్యారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.