మూడేళ్ల పాటు.. ‘పుష్ప 2’ కోసం నిర్విరామంగా కష్టపడ్డాడు సుకుమార్. ప్రేక్షకులు కూడా దానికి తగిన ఫలితమే ఇచ్చారు. ‘పుష్ప 2’ తరవాత సుకుమార్ ఏం చేస్తాడు.? తదుపరి సినిమా ఎప్పుడు? అనే హాట్ టాపిక్ నడుస్తోందిప్పుడు. ‘పుష్ప 2’ తరవాత రామ్ చరణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాలి. అయితే దానికి టైమ్ ఉంది. సుకుమార్ దగ్గర కథ కూడా సిద్ధం గాలేదు. పైగా చరణ్ బుచ్చిబాబుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది పూర్తయ్యేలోగా సుకుమార్ కథ రెడీ చేసుకోవొచ్చు. కాబట్టి బోలెడంత టైమ్ ఉంది.
ఈలోగా సుకుమార్ చక్కబెట్టాల్సిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్లో సెట్స్‌పైకి వెళ్లిన ‘సెల్ఫిష్’కు కొన్ని రిపేర్లు అవసరం. సెకండాఫ్ లో కొంత గందరగోళం ఉందని, సుకుమార్ కూర్చుని సెట్ చేయాలని తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఇదే విషయం గతంలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. వాటి కథలు విని, ఓకే చేయాలి సుకుమార్. సుకుమార్ గత కొంతకాలంగా నడుంనొప్పితో బాధ పడుతున్నారు. దానికి ట్రీట్మెంట్ అవసరం. త్వరలో సుకుమార్ అమెరికా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నడుం నొప్పికి ట్రీట్మెంట్ తీసుకొంటారని టాక్. అమెరికాలో కొంత కాలం ఉండి, కథపై అక్కడే కసరత్తులు చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి 2025లో సుకుమార్ నుంచి కొత్త సినిమాలేం పట్టాలెక్కకపోవొచ్చు. ఆయన బ్యానర్లో మాత్రం కొన్ని సినిమాలు మొదలయ్యే అవకాశం ఉంది.