సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన మరో సినిమా విరూపాక్ష. ఈ కథకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా… ప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కథని సాయిధరమ్‌కి వినిపించి, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌ని లింక్ చేశాడు సుకుమార్. కథలో సుక్కు మార్క్ కనిపించకపోయినా, కీలకమైన మలుపుల విషయంలో సుకుమార్ సలహాలు బాగా పనిచేశాయి. విడుదలకు ముందే మంచి బిజినెస్ జరుపుకొంది. దాంతో… సుకుమార్ వాటాగా రూ.6 కోట్లు దక్కించుకొన్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ పెట్టిన పెట్టుబడి… తన తెలివితేటలే. ఇప్పుడు సినిమా హిట్టయ్యింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
దర్శకుడు త్రివిక్రమ్ కూడా అంతే. భీమ్లా నాయక్ చిత్రాన్ని సెట్ చేసి, సంభాషణలు అందించాడు. ఈ సినిమాకి గానూ త్రివిక్రమ్ కి రూ.10 కోట్లు దక్కాయి. ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చిందంతే! ఈ యేడాది సుకుమార్ నుంచి మరో ఇద్దరు శిష్యులు మెగా ఫోన్ పట్టబోతున్నారని టాక్. అందులో ఓ లేడీ డైరెక్టర్ ఉందట. ఇక నుంచి ప్రతీ యేడాది సుకుమార్ రైటింగ్స్ నుంచి రెండు సినిమాలు చేయాలని, ఇద్దరు శిష్యులను దర్శకులుగా పరిచయం చేయాలని ఫిక్సయ్యాడట సుక్కు.