ఈరోజు ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుక జరుపుకొంటున్నాడు. అభిమానులు ట్విట్టర్లో యంగ్ టైగర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తిస్తున్నారు. టాలీవుడ్ స్టార్లు రానా, బన్నీ, రామ్ కూడా ఎన్టీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సుకుమార్ అయితే ఓ వెరైటీ గిఫ్ట్ పంపాడు. అదో వాల్ క్లాక్. నాన్నకు ప్రేమతో సినిమా గుర్తొచ్చేలా… ఆ క్లాక్‌ని డిజైన్ చేశారు. బటర్‌ఫ్లై… కీ బాల్స్, టైమ్, ఫాలో ఫాలో, ఆ గుండె చప్పుడు సింబల్ ఇవన్నీ జోడించి వెరైటీగా ఆ క్లాక్‌ని తయారు చేశారు.
ఈ గిఫ్ట్ చూసి ఎన్టీఆర్ ఎంతో మురిసిపోతున్నాడు. నాకొచ్చిన మోస్ట్ యూనిక్ గిప్ట్ ఇదే అంటూ ఆ గిఫ్ట్‌ని తన అభిమానులతో పంచుకొన్నాడు తారక్. అన్నట్టు జనతా గ్యారేజ్ లుక్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. ఎన్టీఆర్ మాసీగానూ, స్టైలీష్ గానూ కనిపిస్తోందని అభిమానులు కితాబిస్తున్నారు. దాంతో ఎన్టీఆర్‌లో కొత్త జోష్ వచ్చేసింది. టెంపర్, నాన్నకు ప్రేమతో తో హిట్ కొట్టిన ఎన్టీఆర్….ఈసారి హ్యాట్రిక్ పై గురిపెట్టాడు. అదీ అందుకోబోతున్నట్టే కనిపిస్తోంది.