‘సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేసే దర్శకుడు కింగ్ లా ఉంటాడు’ అన్నారు దర్శకుడు సుకుమార్. సర్కారు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు సుకుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నపుడు సెట్ లో దర్శకుడు కింగ్ లా ఉంటాడు. అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. నా జీవితంలో వన్ నేనొక్కడినే చేసిన రోజులు మర్చిపోలేను. ప్రతి రోజు ఒక అద్భుతమైన మూమెంట్. మైత్రీ మూవీస్ సక్సెస్ లో సర్కారు వారి పాట పెద్ద మైలు రాయి అవుతుందని అన్నారు.
”దర్శకుడు పరశురాం సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడున్న డైలాగ్ రైటర్స్ లో ది బెస్ట్ రైటర్ పరశురాం. అతని డైలాగ్ రైటింగ్ అంత బావుంటుంది. గీత గోవిందంలో పరశురాం క్లాస్ టచ్ చూశాం. అలాంటి దర్శకుడు మాస్ సినిమా చేస్తే ఎలా వుంటుందో సర్కారు వారి పాట లో చూస్తారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ కి మైలు రాయి లాంటి సినిమా అవుతుంది” అన్నారు సుకుమార్.