సుకుమార్ మొదటి సినిమా హీరో అల్లు అర్జున్ అంటే అతనికి చాలా ఇష్టం. అలాగే సుకుమార్ అంటే బన్నీకి కూడా చాలా అభిమానం. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి చేసిన రెండు సినిమాల్లో ‘ఆర్య’ పెద్ద హిట్ అయింది. ‘ఆర్య2’ కూడా కమర్షియల్‌గా ఓకే అనిపించుకుంది. మంచి సినిమా అనే టాక్ కూడా తెచ్చుకుంది. సుకుమార్ ఏ సినిమా చేసినా ఆ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ బన్నీతో డిస్కస్ చేస్తాడు. అలాగే బన్నీ చేసే సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సుకుమార్‌కి చెప్తాడు. వీరిద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
ఇదిలా వుంటే సుకుమార్ లేటెస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు బన్నితో చెప్పలేదట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ ఎక్కువ ఫారిన్లో జరగడం, ఇద్దరూ ఎక్కువగా కలుసుకోకపోవడంతో ఈ సినిమా గురించి చెప్పే అవకాశం సుకుమార్‌కి రాలేదు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. ఈరోజో రేపో ఫస్ట్ కాపీ కూడా రాబోతోంది. అయితే మొదట ఈ సినిమాని తనకే చూపించాలని బన్నీ పట్టుపడుతున్నాడట. జనవరి 13కి సినిమాని రిలీజ్ చెయ్యాలన్న టెన్షన్లో వున్న సుకుమార్‌కి బన్నీ టెన్షన్ కూడా తోడైందట. ఈ చిత్రం ప్రీమియర్‌ను జనవరి 12 రాత్రి వెయ్యాలని సుకుమార్ భావిస్తున్నప్పటికీ అంతకంటే ముందే తను సినిమా చూడాలంటున్నాడట బన్నీ. మరి దీనికి సుకుమార్ ఎలా రెస్పాండ్ అయ్యాడో తెలీదుగానీ బన్నీ మాత్రం ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను అందరికంటే ముందే చూసెయ్యాలని తెగ ఆరాటపడిపోతున్నాడట