సంచలన దర్శకుడు సుకుమార్ గురించి ఓ సెన్షేషనల్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కడుతుంది. ఇటీవల నాన్నకు ప్రేమతోతో సూపర్ హిట్ కొట్టిన సుక్కు మా అంటే మరో రెండు సినిమాలను మాత్రమే తీస్తాడని.. ఆ రెండు సినిమాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని చెబుతున్నారు. కేవలం 7 సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్న సుకుమార్ ఇంత త్వరగా సినిమాకు గుడ్ బై చెప్పాలనుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈ మధ్యనే సుకుమార్ రైటింగ్స్ అని తానో నిర్మాణ సంస్థ స్థాపించడం జరిగింది. అంతేకాదు ఆ సంస్థ నుండి వచ్చిన మొదటి సినిమా కుమారి 21ఎఫ్ సూపర్ హిట్ అందుకుంది. అయితే సుకుమార్ ఎందుకు కేవలం ఇక రెండు సినిమాలే తీయాలనుకున్నాడు. ఒకవేళ దర్శకుడిగా ఆపి నిర్మాతగా కొనసాగించాలనుకుంటున్నాడా.. లేక ఇక పరిశ్రమకే గుడ్ బై చెప్పనున్నాడా అని రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఏది ఏమైనా సంచలన దర్శకుడిగా ట్రెండ్ క్రియేట్ చేసిన సుక్కు ఇంత త్వరగా సినిమాకు బై.. బై.. చెప్పడం సిని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సుకుమార్ ప్రత్యక్షంగా చెప్పలేదు కాబట్టి ఇలాంటి గాలి వార్తలు నమ్మాల్సిన పనిలేదు అని కొందరంటుంటే తను నిజంగానే సినిమాలను ఆపేస్తే మంచి సినిమాలను మిస్ అవ్వడం ఖాయం అనేస్తున్నారు సిని జనాలు.