తన ప్రతీ సినిమాలోనూ కథానాయకుడ్ని కొత్తగా ఆవిష్కరించడం సుకుమార్ స్టైల్. ఆర్యలో బన్నీని, రంగస్థలంలో రామ్‌చరణ్‌నీ, నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్‌నీ సరికొత్తగా చూపించాడు. ఇప్పుడు మహేష్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ లుక్‌పై ప్రత్యేక దృష్టిసారించాడు సుకుమార్. ఇది వరకు మహేష్‌తో చేసిన వన్ – నేనొక్కడినేలో మహేష్ లుక్‌లో ఎలాంటి మార్పులూ చేయలేకపోయాడు. ఆ లోటు ఈ సినిమాతో తీర్చుకుందామని సుకుమార్ ఆలోచన.
రంగస్థలం, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో కథానాయకులు గడ్డంతో కనిపించారు. ఆ స్థాయి గుబురు గడ్డంతో నటించడం ఎన్టీఆర్, చరణ్‌లకు అదే తొలిసారి. మహేష్‌ని కూడా గెడ్డంతో చూపిస్తే ఎలా ఉంటుంది? అనేది సుకుమార్ ఆలోచన. మహేష్ ఇప్పటి వరకూ అలాంటి లుక్‌లో కనిపించలేదు. ఎప్పుడూ నూనూగు మీసాలతోనే దర్శనమిచ్చే మహేష్…. గడ్డంతో కనిపించడం సమ్‌థింగ్ స్పెషలే. కానీ ఈ లుక్ మహేష్‌కి సూటవుతుందా? లేదా? చూసుకోవాలి. అందుకోసం.. ట్రైల్ షూట్ చేయాలనుకుంటున్నార్ట. మహర్షి పనులు అయిపోగానే.. మహేష్‌కి ఈ కొత్త లుక్ ట్రై చేస్తారు. సూట్ అయితే… అదే లుక్‌తో మహేష్ కనిపిస్తాడు. లేదంటే మరో లుక్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే.