సుకుమార్ అనగానే ఇప్పుడు లెక్కలు.. కాలిక్యులేషన్స్ అని గుర్తుకు వస్తున్నాయి కాని.. ఫీల్ మై లవ్.. అంటూ హృదయాన్ని కదిలించి.. సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా ప్రేమ పరవశాన్ని పొందేలా చేస్తాడు. అందుకే లవ్ స్టోరీలు ఎన్ని వచ్చినా సుకుమార్, బన్నిల ఆర్య వాటినట్టికి భిన్నంగా ఎప్పుడు టాప్ మోస్ట్ గానే ఉంటుంది. ఆర్య, జగడం, 100% లవ్, ఆర్య 2, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో ఇది సుకుమార్ ప్రస్థానం. అయితే సుకుమార్ ఏ సినిమా తీసినా దానిలో పర్ఫెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వదు. తన లెక్కలో చెప్పాలంటే.. సినిమా సినిమాకో లెక్క రాసుకుంటాడు దాన్ని లెక్క తప్పకుండా సాల్వ్ చేసేస్తాడు.
ప్రస్తుతం నాన్నకు ప్రేమతోతో హిట్ కొట్టిన సుకుమార్ అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అసలైతే దేవిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్రకటించగా.. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా దేవి సినిమాకే కథ రాయాలి అన్నట్టు మాట్లాడాడు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవి సినిమాను పోస్ట్ పోన్ చేసి అక్కినేని ఫ్యామిలీ కోసం అఖిల్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. ఇప్పటికే నాగచైతన్యకు 100% లవ్ హిట్ ఇచ్చిన సుక్కు ఇప్పుడు అఖిల్ కు కూడా ఆర్య లాంటి సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడట.
సుకుమార్ ప్రేమకథ రాస్తే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. మరి అఖిల్ తో ఆర్య లాంటి సినిమా తీస్తాడా లేక ఆర్యను మించిన సినిమా తీస్తాడా అనేది వేచి చూడాలి. ఏది ఎమైనా మంచి ఎనర్జీ ఉన్న అక్కినేని కుర్రాడు అఖిల్ సుక్కు చేతిలో పడితే ఆ ఫలితం ఎలా ఉంటుందో ఊహిస్తేనే అదుర్స్ అనిపించేలా ఉంది. మరి అది నిజం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.