‘మళ్ళీ రావా’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని మనవడు, నాగార్జున మేనల్లుడు సుమంత్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఈసారీ కొత్త దర్శకుడిని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉగాదికి సినిమా ప్రారంభం కానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను టారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డి బీరం నిర్మించనున్నారు. మార్చి 18న ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం తొమ్మిది గంటలకు సినిమా ప్రారంభోత్సవం. ‘మళ్ళీ రావా’ తరహాలో కొత్త సినిమా కూడా చక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇకపై చేయబోయే ప్రతి సినిమా కొత్తగా వుండాలని సుమంత్ భావిస్తున్నార్ట. ఇందులో కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ప్రారంభోత్సవం రోజు వెల్లడించనున్నారు.