ఎన్టీఆర్ బయోపిక్ లో నాగేశ్వరరావు పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రలో ఎవరు నటిస్తారా? అనే చర్చ చాలా భీకరంగా సాగింది. సుమంత్ వచ్చి ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు. అక్కినేనిగా సుమంత్ ఆ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పడానికి… ఇప్పటి వరకూ వచ్చిన స్టిల్స్ సాక్ష్యంగా నిలిచాయి. ఈ సినిమాలో నటించడం, తాతయ్య పాత్రలో తాను కనిపించడం, ఓ అదృష్టం, బాధ్యతగా భావిస్తున్నా అంటున్నాడు సుమంత్. ఎన్టీఆర్ ఆడియో వేడుకలో సుమంత్ మాట్లాడాడు. తన ఫీలింగ్స్‌ని పంచుకున్నాడు.
”నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా, బాధ్యతగా తీసుకున్నా. ఈ సినిమా ఎలా పూర్తయ్యిందో, నేనెలా చేశానో, కూడా నాకు తెలీదు. మా కుటుంబం, నందమూరి కుటుంబం మధ్యఎన్నో ఏళ్లుగా అనుబంధం కొనసాగుతూనేఉంది. ఈ అనుబంధానికి పునాది.. ఎక్కడ మొదలైందో ఈసినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇది కేవలం సినిమా కాదు. ఇదో చరిత్ర. నందమూరి అభిమానులంతా పండగ చేసుకోబోతున్నారు. మీ సంతోషంలో నేను కూడా భాగస్వామి అవుతా” అన్నాడు సుమంత్.
”సినిమా కంటే. మహా కావ్యం. ఇది వినోదం కోసం కాదు. భావితరాలకు రామారావుగారి గురించి తెలియాలి. ఎంతో స్ఫూర్తి, ఉత్తేజం కలగాలి. సమాజంలో మార్పు రావాలి. చరిత్రలో మిగిలిపోవాలి” అని ఆకాంక్షించాడు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.
”క్రిష్‌తో నా క్రియేటీవ్తో జర్నీ కృష్ణం వందే తో మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్‌తో పూర్తయ్యాంది. నేను డిసెంబరు 14న పుట్టా. కథానాయకుడు సినిమా విడుదల రోజు అది. బాలకృష్ణగారి రాము.. మా ఇంట్లో షూటింగ్ జరుపుకుంది. నేను చూసిన తొలి షూటింగ్ అదే. చంద్రబాబు నాయుడు గారికి పెద్ద థాంక్స్ చెప్పాలి. ఆయన నా తొలి ప్రేక్షకుడు.
ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఎప్పుడయ్యా అనేది గుర్తు లేదు. మూడో తరగతిలో మేజర్ చంద్రకాంత్ చూశా. ఆ రోజున నిజంగా ఆయనెవరో నాకు తెలీదు. కానీ ఆయన్ని కలవాలి అనిపించింది. మా తాతగారిని అడిగాను. కానీ.. కలవడం కుదర్లేదు. ఈలోగానే ఆయన కాలం చేశారు. అప్పుడు ఆయన్ని చూడకపోయినా.. మహానాయకుడి రూపంలో ఇప్పుడు చూసే అవకాశం దక్కింది“ అన్నాడు రానా.