‘మళ్ళీ రావా’ ముందు వరకూ హీరోగా సుమంత్ మార్కెట్ వేరు. ప్రేక్షకుల్లో అతడి రేంజ్ వేరు. ‘మళ్ళీ రావా’తో అతడికి వచ్చిన పేరు, మార్కెట్ వేరు. ఒక్క సినిమాతో మళ్ళీ హీరో రేసులోకి సుమంత్ వచ్చాడు. దాంతో అతడిపై నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన సుమంత్ 25వ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’కి భారీ సినిమాయే. కొత్త దర్శకుడి మీద, సుమంత్ మార్కెట్ మీద నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. సూపర్ నేచురల్ అంశాలతో మిస్టరీ థ్రిల్లర్గా సినిమా రూపొందనుంది. ఇటువంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే భయమని సుమంత్ చెప్పారు. నాకిష్టమైన జానర్ కాదిది కాని, కథ నచ్చడంతో సినిమా చేస్తున్నానన్నారు. ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇందులో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్. టైటిల్ లోగో, ఓపెనింగ్ సెటప్ చూస్తుంటే సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలా వుంది.