నితిన్, నిఖిల్.. లాంటి యంగ్ హీరోలు ఇటీవలే పెళ్లిళ్లు చేసుకుని, ఓ ఇంటివారయ్యారు. ఇప్పుడు సుమంత్ అశ్విన్ వంతు వచ్చింది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ పెళ్లి కుదిరింది. ఈనెల 13న దీపికని పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా కారణాల వల్ల.. వివాహాన్ని చాలా సింపుల్ గా చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరగబోతోంది. అతి తక్కువ బంధు మిత్రుల సమక్షంలో… అశ్విన్ పెళ్లి జరగబోతోందని ఎం.ఎస్.రాజు ఓ ప్రకటనలో తెలిపారు. `తూనీగ తూనీగ` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. `అంతకు ముందు ఆ తరవాత..` మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరవాత…. మరో హిట్టు కోసం చాలా శ్రమిస్తున్నాడు. తను నటించిన `ఇదీ మా కథ` త్వరలో విడుదల కానుంది.
దీపిక ఎవరు?
సుమంత్ ది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. అయితే..ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తేలింది. ఇరు కుటుంబాలకీ చాలా ఏళ్లుగా పరిచయం ఉందట. దీపిక – సుమంత్ చాలా ఏళ్లుగా స్నేహితులని తెలుస్తోంది. దీపిక అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లయ్యాక ఉద్యోగం మానేసి.. ఇద్దరూ హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారట.