వినడానికి కాస్త ఇంట్రస్టింగ్ గా వుంటుందీ కాంబినేషన్. ఎలాగైనా హీరోగా ఒక్క హిట్ కొట్టాలనే ప్రయత్నంలో వున్నాడు హీరో సుమంత్ అశ్విన్. ఎందరో హీరోలకు ఎన్నొ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన నిర్మాత ఎమ్ ఎస్ రాజు తన కొడుక్కు మాత్రం ఒక్క హిట్ ఇవ్వలేకపోయారు. పైగా ఆ క్రమంలో ఆయన నిర్మాతగా కూడా కిందకు దిగిపోయారు.
డైరక్టర్ విఎన్ ఆదిత్య. ఒకప్పుడు మంచి సినిమాలు అందించిన డైరక్టర్. మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట లాంటి పాపులర్ సినిమాలు ఆయన ఖాతాలో వున్నాయి. ఆ తరువాత ఆయన ఎక్కువగా అమెరికాలో వుండిపోయి, ఏదేదో చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి వస్తున్నారు.
ఎమ్ఎస్ రాజు కోరిక మేరకు సుమంత్ అశ్విన్ తో ఓ సిన్మా చేస్తున్నారు. నిర్మాత ఎవరు అన్నది ఇంకా తెలియదు కానీ, సినిమాకు సమర్పకుడు మాత్రం దగ్గుబాటి సురేష్ బాబు. స్వయంగా ఎమ్ ఎస్ రాజునే రిక్వెస్ట్ చేయడంతో ఈ ప్రాజెక్టును సమర్పించడానికి సురేష్ బాబు ఓకె అన్నారని తెలుస్తోంది. అలా అయితే విడుదల తలకాయనొప్పులు వుండవు. కాస్త బ్యానర్ వాల్యూ కూడా వుంటుంది.
అతి త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది.