ఎమ్మెస్రాజు… టాప్ హీరోలకు బ్లాక్ బ్లస్టర్ విజయాల్ని అందించిన నిర్మాత. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ మాత్రం చిన్న సినిమాలు చేసుకొంటూ ‘ఇండ్రస్ట్రీలో నేనూ ఉన్నానోయ్’ అంటూ అప్పుడప్పుడూ పలకరిస్తూ వెళ్తుంటాడు. సినిమాల టైటిళ్లు, చేస్తున్న దర్శకులు, మనోడి పక్కన డాన్సింగులు చేసే హీరోయిన్లు మారుతున్నా.. సుమంత్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందన్న విమర్శలున్నాయి. కేరింత తప్ప…. హిట్ అనదగ్గ సినిమా ఏదీ పడలేదు. ఇప్పుడు రైట్ రైట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆదివారం పాటలు వచ్చాయి. అంతకు ముందే ట్రైలర్‌నీ విడుదల చేశారు.
బొమ్మ చూస్తుంటే.. హిట్టయ్యే లక్షణాలు కనిపిస్తున్నట్టే ఉన్నాయి. ఫొటోగ్రఫీ, విజువల్స్ అన్నీ ఓకే. పాటలూ బాగున్నాయి. పైగా ఇది ఓ విజయవంతమైన చిత్రానికి రీమేక్. తక్కువ బడ్జెట్లో తీసినట్టు అర్థమవుతోంది. క్షణంలాంటి చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఓ మెరుపులా మెరుస్తున్న కాలమిది. కంటెంట్ బాగుంటే, ఎలాంటి సినిమానైనా నెత్తిన పెట్టుకొంటున్నారు. ఆ కంటెంట్‌ని నమ్ముకొన్న రైట్ రైట్ కీ జనాలు కనెక్ట్ అయితే.. సుమంత్ కెరీర్ గాడిలో పడినట్టే. మరి ఈ బస్సు సుమంత్‌ని అనుకొన్న తీరానికి చేరుస్తుందో లేదో చూడాలి.